SP Balasubrahmanyam: ఎస్పీ బాలు పరిస్థితి విషమం... వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స

SP Balu on life support systems at chennai hospital
  • కరోనా బారినపడ్డట్టు స్వయంగా వెల్లడించిన ఎస్పీబీ
  • ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిక
  • గతరాత్రి విషమించిన ఆరోగ్యం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆయనకు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఐసీయూలో వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తనకు కరోనా సోకిందని బాలు కొన్నిరోజుల కిందట స్వయంగా వెల్లడించారు. ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు గుర్తించడంతో వెంటిలేటర్ పై చికిత్స ప్రారంభించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ప్రత్యేక బులెటిన్ లో తెలిపాయి.
SP Balasubrahmanyam
Corona Virus
Critical
MGM Hospital
Chennai

More Telugu News