Amit Shah: ఈశ్వరుడి దయ వల్ల కోలుకున్నా: అమిత్ షా

Amit Shah Tests Negative For Corona
  • కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చింది
  • వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉంటా
  • నేను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఈరోజు నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. ఈశ్వరుడి దయ వల్ల కరోనా నుంచి బయటపడ్డానని చెప్పారు. కరోనా నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉంటానని చెప్పారు. తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్లకు, ప్యారా మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. 55 ఏళ్ల అమిత్ షా రెండు వారాల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Amit Shah
Corona Virus
BJP

More Telugu News