Hen: తనకు మిస్ ఇండియా కిరీటాన్ని తెచ్చిపెట్టిన ప్రశ్నను గుర్తు చేసుకున్న నమ్రతా శిరోద్కర్!

Namrata Remembers her Miss india Moments
  • 1993లో మిస్ ఇండియాగా గెలిచిన నమ్రత
  • ఫైనల్ లో కోడి ముందా? గుడ్డు ముందా? అన్న ప్రశ్న
  • కోడే ముందని సమాధానం ఇచ్చిన నమ్రత
మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆనాటి ఫైనల్ రౌండ్ ను, తనకు ఎదురైన ప్రశ్నను గుర్తు చేసుకున్న ఆమె, ఆ వీడియోను తాజాగా, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. అనాదిగా సమాధానం లభించని చిక్కు ప్రశ్నగా ఉన్న 'కోడి ముందా? గుడ్డు ముందా?' అన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది.

దీనికి ఆమె సమాధానం ఇస్తూ, కోడి లేకపోతే గుడ్డు లేదు కాబట్టి కోడే ముందని చెప్పారు. ఈ సమాధానానికి సంతృప్తి చెందిన న్యాయ నిర్ణేతలు ఆమెను విజేతగా ప్రకటించారు. ఆ తరువాత ఆమె సినిమాల్లోకి రావడం, మహేశ్ బాబు పక్కన 'వంశీ' చిత్రంలో నటిస్తున్న సమయంలో ప్రేమలో పడటం, ఆపై పెళ్లి చేసుకోవడం తదితర విషయాలు అందరికీ తెలిసినవే.

Hen
Egg
Namrata
Miss India

More Telugu News