Kathi Mahesh: కత్తి మహేశ్ అరెస్ట్.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు!

Kathi Mahesh arrested and produced in court
  • శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లు చేసిన కత్తి మహేశ్
  • కత్తి మహేశ్ పోస్టులు పెట్టారని నిర్ధారించిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • 2018 నుంచి దాదాపు 5 కేసులు నమోదు
సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువులు ఆరాధించే శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై హిందూ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై కేసులు నమోదు చేసి, విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు... ఆ పోస్టులను మహేశ్ పోస్ట్ చేశారని నిర్ధారించారు.

ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి.
Kathi Mahesh
Arrest
Nampalli Court
Sriram
Tollywood

More Telugu News