నాని 'వి'కి అమెజాన్ భారీ ఆఫర్... ఓకే చెప్పేసిన దిల్ రాజు!

Nani New Movie Releasing in Amazon Prime
  • వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల
  • త్వరలో రానున్న అధికారిక ప్రకటన
  • ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి'
దిల్ రాజు బ్యానర్లో నాని నటించిన 25వ చిత్రం 'వి' షూటింగ్ పూర్తయినా, కరోనా, లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓటీటీకి విక్రయించేందుకు గతంలో వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ ను దిల్ రాజు తిరస్కరించారని, ఈ చిత్రాన్ని సినిమా హాల్స్ లోనే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు రాగా, ఇప్పుడాయన మనసు మారినట్టు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్ రాగా, తాజాగా దిల్ రాజు, సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు అంగీకరించారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుందని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. కాగా, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావు హైదరీ హీరోయిన్లుగా నటించారు.
Go Back to Shorts
Nani
V
Dil Raju
OTT
Amazon Prime

More Telugu News