సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Fri, Aug 14, 2020, 07:34 AM
Nivetha Thamos to turn as a director
  • దర్శకురాలిగా మారతానంటున్న కథానాయిక 
  • రీమేక్ సినిమాలో డాక్టర్ రాజశేఖర్
  • ఓటీటీ ద్వారా సాయితేజ్ సినిమా విడుదల  
*  త్వరలో తాను దర్శకురాలిగా మారనున్నానని అంటోంది కథానాయిక నివేద థామస్. 'అప్పుడే పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలని నాకు లేదు. దర్శకురాలిగా మారాలనుంది. అందుకే కొన్ని కథలు తయారుచేసుకుంటున్నాను. త్వరలోనే డైరెక్టర్ గా మారతాను' అని చెప్పింది.
*  ప్రముఖ నటుడు రాజశేఖర్ తన తాజా చిత్రాన్ని నీలకంఠ దర్శకత్వంలో చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'జోసెఫ్' చిత్రానికి రీమేక్ గా దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.    
*  మెగా హీరో సాయితేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం ఓ ఓటీటీ సంస్థతో చిత్ర నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో దీనిని నిర్మించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement