Nara Lokesh: అచ్చెన్నను కక్ష సాధింపు కోసం వేధించారు... ఇప్పుడాయన కరోనా బారినపడ్డారు: లోకేశ్

Lokesh responds after Atchannaidu tested corona positive
  • టీడీపీ నేత అచ్చెన్నాయుడికి కరోనా పాజిటివ్
  • అచ్చెన్న త్వరగా కోలుకోవాలంటూ లోకేశ్ ట్వీట్
  • గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్న
టీడీపీ నేత అచ్చెన్నాయుడు కరోనా బారినపడ్డారన్న వార్తల నేపథ్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఆపరేషన్ అయిందని తెలిసి కూడా కక్ష సాధించడం కోసం అచ్చెన్నాయుడిని వేధించారని, ఇప్పుడాయన కరోనా బారినపడ్డారని వ్యాఖ్యానించారు. అచ్చెన్న త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్ లో తెలిపారు. ఈఎస్ఐ కొనుగోళ్ల స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన జలుబుతో బాధపడుతుండడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
Nara Lokesh
Atchannaidu
Corona Virus
Positive
ESI Scam

More Telugu News