Meera Mithun: కోలీవుడ్ లో నెపోటిజం వల్లే సూర్య, విజయ్ తెరపైకి రాగలిగారు: మీరా మిథున్ తీవ్ర వ్యాఖలు

Suria responds on Meera Mithun comments
  • కోలీవుడ్ లో కలకలం రేపుతున్న మీరా మిథున్
  • ఇప్పటికే త్రిషపై తీవ్ర ఆరోపణలు చేసిన మీరా
  • వీరిద్దరూ సొంత ఫ్యాన్స్ ను కూడా కంట్రోల్ చేయలేరని విమర్శ
తమిళ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ కోలీవుడ్ లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే త్రిషపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. త్రిషకు కులపిచ్చి ఎక్కువని మండిపడింది. ఇండస్ట్రీలో తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని చెప్పింది. తాజాగా కోలీవుడ్ స్టార్లు సూర్య, విజయ్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోలీవుడ్ లో నెపోటిజం (బంధుప్రీతి) వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని, ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని విమర్శించింది. సొంత ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే శక్తి కూడా వీరికి లేదని... చేతికి గాజులు తొడుక్కుని కూర్చుంటారని మండిపడింది. ఈ వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి. మీరా వ్యాఖ్యలను సినీ ప్రముఖులు సైతం తప్పుపడుతున్నారు.

ఈ సందర్భంగా సూర్య స్పందిస్తూ... తక్కువ స్థాయి వ్యక్తులు చేసే విమర్శలపై స్పందిస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దని చెప్పాడు. విలువైన ఆ సమయాన్ని సమాజం కోసం వినియోగించాలని సూచించాడు. తనకు మద్దతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు.
Meera Mithun
Suria
Vijay
Kollywood

More Telugu News