Sensex: మార్కెట్లకు వరుసగా రెండో రోజు నష్టాలు

  • 59 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 7 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా పెరిగిన ఎల్ అండ్ టీ
Stock markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ నాటి ట్రేడింగ్ లో మెటల్, ఆటో, మీడియా స్టాకుల్లో వచ్చిన లాభాలు... ఫార్మా, టెలికాం, బ్యాంకింగ్ స్టాకుల నష్టాలతో హరించుకు పోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 38,310కి పడిపోయింది. నిఫ్టీ 7 పాయింట్లు కోల్పోయి 11,300 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (4.31%), టైటాన్ కంపెనీ (3.73%), హీరో మోటో కార్ప్ (1.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.21%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.20%).

టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.35%), సన్ ఫార్మా (-2.11%), ఐటీసీ లిమిటెడ్ (-1.30%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.74%), యాక్సిస్ బ్యాంక్ (-0.64%).

More Telugu News