Atchannaidu: అచ్చెన్నాయుడికి కరోనా.. ఆందోళనలో కుటుంబసభ్యులు

Atchannaidu tests with Corona positive
  • ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడు
  • నిన్న ఉదయం నుంచి జలుబు
  • కరోనా చికిత్స అందిస్తున్న రమేశ్ ఆసుపత్రి వైద్యులు
టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈఎస్ఐ కేసులో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం ప్రతివారం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ఆసుపత్రి నివేదిక ఇస్తోంది. ఈ నేపథ్యంలో, అచ్చెన్నకు కరోనా సోకడంపై హైకోర్టుకు లేఖ రాయనున్నారు. రమేశ్ ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని తెలియడంతో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
Atchannaidu
Corona Virus
Positive
Telugudesam

More Telugu News