Andhra Pradesh: ఏపీ కరోనా బులెటిన్... 24 గంటల్లో మరో 82 మంది మృతి!

AP witnessed 82 Corona deaths in past 24 hours
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,996 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 1,504 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో చిత్తూరు 963, విశాఖపట్నం 931, అనంతపురం 856, పశ్చిమగోదావరి 853, కర్నూలు 823 ఉన్నాయి. మరోవైపు గత 24 గంటల్లో 9,499 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకున్నాయి. మొత్తం మరణాలు 2378గా నమోదయ్యాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Cases

More Telugu News