Suresh Daggubati: యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు: నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు

The man who did accident is not my son says Daggubati Suresh Babu
  • హైదరాబాద్ మణికొండలో ప్రమాదం
  • దగ్గుబాటి అభిరామ్ యాక్సిడెంట్ చేశాడంటూ వార్తలు
  • యాక్సిడెంట్ వార్తలను ఖండించిన సురేశ్ బాబు
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ కారు యాక్సిడెంట్ కు గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మణికొండలో అభిరామ్ కారు మరో కారును ఢీకొందని... అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం ఇరువురూ రాయదుర్గం పీఎస్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తలను ఆయన ఖండించారు. యాక్సిడెంట్ చేసింది తన కుమారుడు అభిరామ్ కాదని... ఆ కారు కూడా తన కుమారుడిది కాదని స్పష్టం చేశారు. 
Suresh Daggubati
Abhiram
Tollywood
Accident

More Telugu News