చౌక ధరలో రెమెడిసివిర్ ఇంజక్షన్ ను ఆవిష్కరించిన జైడస్ కాడిలా
- 100 ఎంజీ ధర రూ.2,800
- రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపిన జైడస్
- ఇప్పటికే నాలుగు కంపెనీల నుంచి రెమెడిసివిర్
కాగా, ఇప్పటికే రెమెడిసివిర్ ను నాలుగు కంపెనీలు ఇండియాలో మార్కెటింగ్ చేస్తుండగా, ఇప్పుడు జైడస్ కాడిలా ఐదవ సంస్థగా నిలిచింది. హెటిరో ల్యాబ్స్, సిప్లా, మైలాన్ ఎన్వీ, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లు ఇప్పటికే ఈ డ్రగ్ జనరిక్ వర్షన్ ను విడుదల చేశాయి. గిలియడ్ సైన్సెస్ మొత్తం 127 దేశాల్లోని కంపెనీలతో డీల్స్ కుదుర్చుకుని రెమెడిసివిర్ తయారీకి అనుమతులను ఇచ్చింది.