Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. నిన్న 11 మంది బలి

11 covid patients dead in Telangana yesterday alone
  • 23,303 మందికి పరీక్షలు
  • వెలుగులోకి 1,931 కేసులు
  • 86,475కి చేరుకున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజూ వందలాదిగా కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిన్న కొత్తగా 23,303 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,931కి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,475కు పెరిగింది. నిన్న కొత్తగా 11 మంది కరోనా  కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 665కు పెరిగింది.

ఇక, నిన్న కొత్తగా 1,780 కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 63,074కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 22,736 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో పేర్కొంది. అలాగే, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,89,150 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


Telangana
Corona Virus
Corona test
Hyderabad

More Telugu News