Andhra Pradesh: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ అక్టోబరు 2కి వాయిదా!

  • ఆగస్టు 15న ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా
  • కోర్టులో పిటిషన్లే కారణం!
  • ఉగాది నుంచి పలుమార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ
 Housing documents distribution adjourned again

అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారు నిర్ణయం అమలు మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి తొలుత ముహూర్తం నిర్ణయించారు. ఆ తర్వాత పలు కారణాలతో ఆ నిర్ణయం అంబేద్కర్ జయంతికి వాయిదా పడింది. అక్కడ్నించి జూలై 8 వైఎస్ జయంతి నాటికి ముహూర్తం మారింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనుకున్నా అది కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడింది.

ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతోంది. అందుకే, అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని అనుకుంటోంది. ఇళ్ల స్థలాల సేకరణలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని సర్కారు ఆశిస్తోంది.

More Telugu News