Renu Desai: రెండు లగ్జరీ కార్లు అమ్మేసిన రేణు దేశాయ్

Renu Desai sells her luxury cars
  • డీజిల్, పెట్రోల్ వాహనాలను వాడొద్దని రేణు సూచన
  • ఎలక్ట్రిక్ వాహనాలను కొనుక్కోవాలని పిలుపు
  • అందుకే తన ఆడీ, పోర్షే కార్లను అమ్మేశానని వ్యాఖ్య
సినీ నటి రేణు దేశాయ్ ఒక వైపు కుటుంబం, మరోవైపు సినిమాలకు చెందిన పనులను చూసుకుంటూనే సామాజిక బాధ్యతలపై కూడా దృష్టి సారిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఒక పని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు రేణు తెలిపింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు.

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని రేణు విన్నవించారు. అందరూ ఎలక్ట్రిక్ కార్లు, బైకులు కొనే పనిలో పడాలని చెప్పారు. వాయు కాలుష్యానికి కారణమయ్యే వాటికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అన్నారు. ఇంధనంతో నడిచే ఆడీ ఏ6, పోర్షే బాక్సర్ కార్లను తాను అమ్మేశానని... ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొనుక్కున్నానని చెప్పారు. మారిషస్ లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని  తెలిపారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో భూమిపై నివసించే జీవరాశులకు క్యాన్సర్ అందిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
Renu Desai
Tollywood
Cars

More Telugu News