Yuvraj Singh: క్యాన్సర్ బారినపడిన సంజయ్ దత్ కు యువరాజ్ సింగ్ సంఘీభావం

Yuvraj Singh expresses solidarity towards Cancer hit Sanjay Dutt
  • ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సంజయ్ దత్
  • ఓ ఫైటర్ లా పోరాడాలన్న యువరాజ్
  • గతంలో క్యాన్సర్ నుంచి కోలుకున్న యువీ
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డారు. ఇటీవలే ఆసుపత్రిలో చేరి రెండ్రోజుల కిందట డిశ్చార్జి అయ్యారు. ఆయన లంగ్ క్యాన్సర్ 4వ దశకు చేరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సంజయ్ దత్ కు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంఘీభావం ప్రకటించారు. గతంలో క్యాన్సర్ బారినపడి కోలుకున్న యువరాజ్ తాజాగా తన సందేశాన్ని వెలువరించారు. క్యాన్సర్ తో వ్యవహారం ఎలా ఉంటుందో తనకు తెలుసని, ఆ నొప్పిని స్వయంగా అనుభవించి, భరించానని పేర్కొన్నారు.

"సంజయ్ దత్... ఇప్పుడు మీరు కూడా ఓ ఫైటర్ లా పోరాడాలి. మీరు మనసును మరింత దృఢంగా మలుచుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను" అంటూ ట్విట్టర్ లో స్పందించారు. కాగా, అప్పట్లో క్యాన్సర్ కు చికిత్స కోసం యువరాజ్ సైతం అమెరికా వెళ్లారు. ఇప్పుడు సంజయ్ దత్ కూడా అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పని నుంచి కొంత విరామం తీసుకుంటున్నానని సంజూ ప్రకటించారు.
Yuvraj Singh
Sanjay Dutt
Lung Cancer
USA
Bollywood

More Telugu News