Shami: అత్యాచారం చేసి చంపేస్తామంటూ మొహమ్మద్ షమీ భార్యకు బెదిరింపులు!

Death threats to Mohammed Shamis wife
  • అయోధ్య భూమిపూజ సందర్భంగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన హసీన్
  • బెదిరింపులపై కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు
  • అభద్రతాభావం వెంటాడుతోందని ఫిర్యాదులో పేర్కొన్న హసీన్
అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ కోల్ కతా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుమార్తెకు భద్రత కల్పించాలని కోరారు. తాను ఇప్పటికే నిస్సహాయురాలినైపోయానని, తనను అభద్రతాభావం వెంటాడుతోందని చెప్పారు. తమకు భద్రతను కల్పించలేకపోతే... మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగిన సందర్భంగా... హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో హసీన్ గ్రీటింగ్స్ చెప్పారు. దీంతో, కొందరు ఆమె పట్ల అసభ్యంగా కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం షమీ, హసీనా ఇద్దరూ విడివిడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Shami
Wife
Haseen Jahaan
Death Threat

More Telugu News