Anushka Sharma: యాక్టింగ్ కు గుడ్ బై చెప్పే యోచనలో అనుష్క శర్మ?

Anushka Sharma is in thoughts of leaving acting career
  • 2018 నుంచి నుంచి పూర్తి స్థాయి పాత్రను పోషించని అనుష్క శర్మ
  • నిర్మాతగా బిజీగా ఉన్న అనుష్క
  • తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను తిరస్కరిస్తున్న వైనం
బాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగుతున్న అనుష్క శర్మ... నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా ఐదు చిత్రాలను నిర్మించింది. వెబ్ సిరీసుల నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో నిర్మించిన 'పాతాళ్ లోక్' సిరీస్ హిట్టైంది. ఈ సిరీస్ కు కూడా అనుష్కనే నిర్మాత. రానున్న రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్ లను నిర్మించాలనే యోచనలో అనుష్క ఉంది. మంచి కథనంతో  మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది.

మరోవైపు అనుష్క గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. నటనకు ముగింపు పలకాలనే యోచనలో అనుష్క ఉందనేదే ఆ వార్త. అందుకే తన వద్దకు వస్తున్న స్క్రిప్టులను ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తోందనేది బీటౌన్ టాక్. 2018లో విడుదలైన 'జీరో' సినిమా తర్వాత అనుష్క పూర్తి స్థాయి పాత్రను ఇంత వరకు పోషించకపోవడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుష్క పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబానికి సమయాన్ని కేటాయించడం కోసం అనుష్క ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకుంటున్నారు.
Anushka Sharma
Bollywood
Acting

More Telugu News