Fire Accident: అగ్ని ప్రమాదం జరిగిన స్వర్ణప్యాలెస్‌లో‌ అన్ని బాధ్యతలు హోటల్‌ నిర్వాహకులవే: రమేశ్ ఆసుపత్రి

  • ఎక్కువ మందికి వైద్యం అందించాలని అభ్యర్థనలు వచ్చాయి
  • సౌకర్యాలున్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను తీసుకున్నాం
  • హోటల్‌ నిర్వహణతో మాకు సంబంధం లేదు
  • అందులోని రోగులకు వైద్య సేవలు మాత్రమే అందించాం

విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా రమేశ్ ఆసుపత్రి వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై  రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం మరోసారి స్పందించింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతోనే తాము బందరు రోడ్డులోని తమ ఆసుపత్రిని కొవిడ్‌-19 రోగులకు చికిత్స కోసం కేటాయించామని తెలిపింది.

అయితే, అక్కడ 30 పడకలు మాత్రమే ఉన్నాయని, కరోనా బాధితుల్లో అధిక మందికి వైద్యం అందించాలని అభ్యర్థనలు రావడంతోనే తాము అన్ని సౌకర్యాలున్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ను తీసుకున్నామని తెలిపింది. హోటల్‌ నిర్వహణతో తమకు సంబంధం లేదని, అందులోని రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతను మాత్రమే తమ‌ ఆసుపత్రి నిర్వహించిందని వివరించింది. అంతేగాక, కరోనా కేంద్రం నిర్వహణతో పాటు రెంటును వసూలు చేయడం వంటి అన్ని బాధ్యతలు హోటల్‌ నిర్వాహకులవేనని చెప్పింది.

More Telugu News