మాది అభివృద్ధి, వైసీపీది విధ్వంసం: దేవినేని ఉమ

devineni slams ycp
  • ప్రతి జిల్లాలో చంద్రబాబు అభివృద్ధికి బాటలు పరిచారు
  • సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చాం
  • సాగునీరు ఇచ్చాం, విద్యా సంస్థలు పెట్టాం
  • ప్రజా రాజధానిలో అభివృద్ధికి ప్రభుత్వ వెబ్ సైటే సాక్ష్యం
  • 14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి  
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ పాలనలో తాము అభివృద్ధి పనులు చేస్తే, వైసీపీ సర్కారు మాత్రం విధ్వంసం సృష్టిస్తోందని ఆయన అన్నారు.  

'ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బాటలు పరిచారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు తెచ్చాం, సాగునీరు ఇచ్చాం, విద్యా సంస్థలు పెట్టాం. ప్రజా రాజధానిలో అభివృద్ధికి ప్రభుత్వ వెబ్ సైటే సాక్ష్యం. మాది అభివృద్ధి, వైసీపీది విధ్వంసం. 14 నెలల్లో మీరేం చేశారో ప్రజలకు చెప్పండి వైఎస్‌ జగన్‌ గారు' అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నిన్న జూమ్ యాప్‌ లో మాట్లాడిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News