Pothireddypadu: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై రేపు ఎన్జీటీలో విచారణ

  • ఏపీ, తెలంగాణల మధ్య వివాదానికి కారణమవుతున్న పోతిరెడ్డిపాడు
  • అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర జల్ శక్తి శాఖ, తెలంగాణ ప్రభుత్వం
  • ప్రాజెక్టు ఒప్పందాలకు విరుద్ధం అంటోన్న తెలంగాణ
Trial on Pothireddypadu will be held in NGT tomorrow

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంశం ఎక్కువగా చర్చకు వస్తోంది. దీనిపై రేపు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ జరగనుంది. పోతిరెడ్డిపాడు విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర జల్ శక్తి శాఖ అఫిడవిట్ దాఖలు చేశాయి. అనుమతి ఇచ్చేవరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దంటూ కేంద్ర జల్ శక్తి శాఖ అఫిడవిట్ లో పేర్కొంది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఒప్పందాలకు విరుద్ధంగా ఉందంటూ ఆరోపణలు చేస్తోంది.

More Telugu News