Vijayasai Reddy: 'షేమ్ షేమ్ బాబూ' అంటూ టీడీపీ అధినేతపై విజయసాయిరెడ్డి విమర్శలు

Vijayasai Reddy responds Chandrababu comments on development of districts
  • 13 జిల్లాలనూ అభివృద్ధి చేశానన్న చంద్రబాబు
  • చంద్రబాబు ఏవేవో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని విజయసాయి విమర్శలు
  • కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని వ్యంగ్యం
తమ హయాంలో రాష్ట్రంలోని 13 జిల్లాలనూ అభివృద్ధి చేశామని, వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఏంచేసిందో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సవాల్ విసరడం తెలిసిందే. దీనిపై వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి స్పందించారు. షేమ్... షేమ్... బాబూ అంటూ ట్వీట్ చేశారు. బట్టలు విడిచిన మూర్ఖపు రాజు తాను వేసుకున్న దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించడం లేదనుకున్నాడట! అంటూ ఎద్దేవా చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 151 స్థానాల్లో ఓడిపోయిన చంద్రబాబు, చివరికి కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు 13 జిల్లాలను తానే అభివృద్ధి చేశానంటూ ఏవేవో గ్రాఫిక్స్ చూపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.
Vijayasai Reddy
Chandrababu
Development
Districts
Andhra Pradesh

More Telugu News