Chandrababu: ఈ యువకుడిలో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో ఆలోచించాలి: చంద్రబాబు

 Chandrababu appeals people think on latest incidents
  • ప్రసాద్ అనే యువకుడికి పీఎస్ లో శిరోముండనం
  • ఇంతవరకు న్యాయం జరగలేదన్న చంద్రబాబు
  • నక్సలైట్ గా మారతానని లేఖ రాసే పరిస్థితి వచ్చిందని వెల్లడి 
కొన్నిరోజుల కిందట వైసీపీ ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ప్రసాద్ అనే దళిత యువకుడికి సీతానగరం పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసి అవమానించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల దుర్మార్గం, అణచివేత, అహంకారం, వివక్ష... ఇవన్నీ పెచ్చుమీరితే యువత ఎలా పక్కదారి పడుతుందో చెప్పడానికి ప్రసాద్ ఉదంతమే ఉదాహరణ అని తెలిపారు. జరిగిన ఘటనపై ఇంతవరకు ప్రసాద్ కు న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

అందుకే తాను నక్సలైట్ గా మారేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతో బాధ కలిగిందని చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడిలో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, రాష్ట్రంలో వ్యవస్థలు ఎంత ప్రమాదకరస్థితికి దిగజారాయో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
Chandrababu
Prasad
Tonsure
Seethanagaram
Dalits

More Telugu News