నా ప్రతి మాట వెనక ఒక వ్యూహం ఉంటుంది: జగ్గారెడ్డి

10-08-2020 Mon 19:22
  • పీసీసీ రేసులో నేను కూడా ఉన్నాను
  • పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని సోనియాకు లేఖ రాశాను
  • ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేయను
There is a strategy behind my every word says Jagga Reddy
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా తనను నియమించాలని కోరుతూ తమ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీనియర్ నాయకులందరినీ కలుపుకుని, పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు అవసరమైతే గ్రామాల్లో కూడా పర్యటిస్తానని తెలిపారు.

అయితే, పీసీసీ పదవి కోసం తాను ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేయబోనని చెప్పారు. తన ప్రకటనలతో కొందరు గందరగోళానికి గురవుతున్నారంటూ... సొంత పార్టీలోనే తనను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి జగ్గారెడ్డి చెప్పారు. తన ప్రతి మాట వ్యూహాత్మకంగానే ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి చెప్పారు. నిక్కర్లు వేసుకునే వయసులోనే తాను రాజకీయాలను మొదలు పెట్టానని తెలిపారు. తనపై ఫేస్ బుక్ లో విమర్శలు చేస్తున్న వారు వారి ఫోన్ నెంబర్ కూడా పెడితే... వాళ్ల ఇంటికి వెళ్లి అనుమానాలను తీరుస్తానని చెప్పారు.