COVID-19: ఏపీ కరోనా అప్ డేట్స్: 80 మరణాలు, 7,665 కొత్త కేసులు

Covid effect continues AP as thousands of new cases surfaced
  • ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి
  • 2,116కి చేరిన మరణాల సంఖ్య
  • తాజాగా  6,924 మంది డిశ్చార్జి 
కరోనా మహమ్మారి విజృంభణతో ఏపీ విలవిల్లాడుతోంది. రాష్ట్రంలో మరో 80 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కరోనాతో కన్నుమూశారు. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 2,116కి పెరిగింది. ఇక, కొత్తగా 7,665 పాజిటివ్ కేసులు వచ్చాయి. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్న తరుణంలో ఇవాళ వెల్లడించిన కేసుల సంఖ్య కాస్త ఊరట కలిగిస్తోంది. మొత్తమ్మీద ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,35,525కి చేరింది. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న 6,924 మందిని డిశ్చార్జి చేశారు. 87,773 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
COVID-19
Andhra Pradesh
Positive Cases
Deaths
Corona Virus

More Telugu News