టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ కి భూకేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Mon, Aug 10, 2020, 03:08 PM
Telangana high court questions government on land allotment to director N Shankar
  • దర్శకుడు ఎన్.శంకర్ కు ఐదెకరాల భూమి కేటాయింపు
  • ఎకరం రూ.5 లక్షలకే కేటాయింపు
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు
టాలీవుడ్ దర్శకుడు ఎన్.శంకర్ హైదరాబాదులో సినీ స్టూడియో నిర్మాణం కోసం భూమిని కేటాయించాలంటూ గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దాంతో తెలంగాణ సర్కారు ఆయనకు రంగారెడ్డి జిల్లా మోకిల్లలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించింది. అయితే, ఈ భూమి కోట్ల విలువ చేస్తుందని, అలాంటప్పుడు ఎకరాకు రూ.5 లక్షల చొప్పున దర్శకుడికి ఏ విధంగా కేటాయిస్తారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది.

రూ.2.5 కోట్ల విలువైన భూమిని ఎంతో తక్కువ ధరకు ఏ ప్రాతిపదికన కేటాయించారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడానికి తగిన ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని అడిగింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఏజీ క్వారంటైన్ లో ఉన్నారని, తమకు కొంత గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha