ఇలాంటి సినిమాలు చేయకూడదని నాకు కొందరు చెప్పారు: విద్యాబాలన్
- 'డర్టీ పిక్చర్' సినిమాలో నటించవద్దని కొందరు చెప్పారు
- నీకు పిచ్చి పట్టిందని కొందరు అన్నారు
- డైరెక్టర్ మిలాన్ పై నాకు నమ్మకం ఉంది
'డర్టీ పిక్చర్' డైరెక్టర్ మిలాన్ తనపై పూర్తి నమ్మకం ఉంచారని... ఆ సినిమా నిర్మాత ఏక్తా కపూర్ గురించి తనకు అప్పటికే తెలుసని విద్యాబాలన్ తెలిపింది. ఏక్తాతోనే తాను కెరీర్ ను ప్రారంభించానని వెల్లడించింది. మిలాన్ తీసే సినిమాలో కళాసౌందర్యం ఉంటుందనే నమ్మకం తనకుందని... అందుకే సినిమా చెత్తగా ఉండదనే తాను నమ్మానని చెప్పింది. ఇలాంటి సినిమా చేయడానికి నీకు పిచ్చి పట్టిందా? అని కొందరు ప్రశ్నించారని... ఇలాంటి సినిమాలు నీవు చేయకూడదని సూచించారని తెలిపింది.
ఈ సినిమాలో నటించడంపై తన తల్లిదండ్రులతో మాట్లాడానని... నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని వారు చెప్పారని విద్య తెలిపింది. దీంతో, తాను 'డర్టీ పిక్చర్'కు ఓకే చెప్పానని వెల్లడించింది. ఈ సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చిందని చెప్పింది.