హర్యాణాలో త్వరలో గాడిద పాల డెయిరీ.. మరి, లీటర్ ధర ఎంతో తెలుసా?
- హర్యాణాలోని హిస్సార్ లో ఏర్పాటు కానున్న గాడిద పాల డెయిరీ
- హలారి గాడదలతో పాల ఉత్పత్తి
- లీటర్ గాడిద పాలు రూ. 7 వేలు
హలారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ కు రూ. 7 వేల వరకు ఉంటుంది. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ గాడిదల పాలు తోడ్పడతాయి. ఈ నేపథ్యంలోనే గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. తొలుత గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని... ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది.
ఈ సందర్భంగా రీసర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ... ఆవు, గేదె పాల ద్వారా చిన్న పిల్లలు అప్పుడప్పుడు అలర్జీల బారిన పడుతుంటారని... కానీ హలారి బ్రీడ్ గాడిదల పాలతో ఎలాంటి అలర్జీలు రావని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్లు ఈ పాలలో ఉంటాయని తెలిపారు. గతంలో త్రిపాఠి ఆధ్వర్యంలోనే గాడిద పాలపై రీసర్స్ ప్రారంభమైంది.