Varla Ramaiah: విజయసాయిరెడ్డి గారూ, మీకు చింత చచ్చినా పులుపు చావలేదు!: వర్ల రామయ్య

Varla Ramaiah slams Vijayasai Reddy who commented on Chandrababu
  • చంద్రబాబును విమర్శించిన విజయసాయి
  • మీరేం సాధించారో చెప్పండి అంటూ వర్ల రామయ్య కౌంటర్
  • హైదరాబాదు అభివృద్ధి కర్త చంద్రబాబేనని ప్రపంచానికి తెలుసంటూ ట్వీట్
చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. నాయుడు బాబూ, హైదరాబాద్ నువ్వే కట్టానంటున్నావు, మరి గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, ఉస్మానియా వర్సిటీ ఇవన్నీ లోకేశ్ కట్టాడా? అని విజయసాయి వ్యంగ్యం ప్రదర్శించారు.

దీనికి వర్ల రామయ్య బదులిస్తూ, విజయసాయిరెడ్డి గారూ మీకు చింత చచ్చినా పులుపు చావలేదు! అంటూ విమర్శించారు. "చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు, కానీ హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాదును సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతటికీ తెలుసు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించారో చెప్పండి?" అంటూ నిలదీశారు.
Varla Ramaiah
Vijay Sai Reddy
Chandrababu
Hyderabad
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News