Chandrababu: బర్త్ డే బాయ్ మహేశ్ బాబుకు చంద్రబాబు గ్రీటింగ్స్

TDP Chief Chandrababu wishes Mahesh Babu on his birthday
  • నేడు మహేశ్ బాబు జన్మదినం
  • గతం వారం రోజుల్లో హోరెత్తిస్తున్న అభిమానులు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత
కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య హీరో మహేశ్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మహేశ్ పుట్టినరోజు ఆగస్టు 9నే అయినా, వారం రోజుల నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలైంది. కామన్ డిస్ ప్లే (సీడీపీ)లతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఇక, పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబుపై శుభాకాంక్షల జడివాన కురుస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో మహేశ్ కు విషెస్ తెలిపారు.

"తెలుగు చలనచిత్ర ప్రఖ్యాత నటుడు శ్రీ మహేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సినీ రంగంలో ధృవతారగా వెలగాలని కోరుకుంటూ, ఇలాంటివే మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా మహేశ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించి, సూపర్ స్టార్ గా ఎదిగిన మీ నట జీవితం ఎందరికో ఆదర్శం అంటూ కొనియాడారు.
Chandrababu
Mahesh Babu
Birthday
Tollywood
Telugudesam

More Telugu News