Miheeka Bajaj: రానాతో పెళ్లిలో మిహీక ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

Miheeka wears designer Lehenga in wedding with Rana
  • గోల్డెన్ క్రీమ్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయిన మిహీకా
  • లెహంగా ధరించిన అమ్మడు
  • డ్రెస్ డిజైన్ చేసిన అనామికా ఖన్నా
టాలీవుడ్ నటుడు రానా, ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ మిహీక భరద్వాజ్ ల పెళ్లి గతరాత్రి హైదరాబాదు రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ పెళ్లిలో రానా, మిహీక ఇద్దరూ డిజైనర్ పెళ్లి దుస్తుల్లో ధగధగ మెరిసిపోయారు. ముఖ్యంగా, వధువు మిహీక ధరించిన లెహంగా డ్రెస్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. లైట్ గోల్డెన్ కలర్ లో క్రీమ్ మిక్స్ అయినట్టుగా ఉన్న ఈ లెహంగా, కనకాంబరం రంగులో దుపట్టా కాంబినేషన్ అదిరిపోయింది. అయితే, ఖరీదు కూడా అదే స్థాయిలో ఉంది.

ఈ ఒక్క డ్రెస్ ధర రూ.6 లక్షలు అని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా ఎంతో శ్రమించి మిహీకా డ్రెస్ ను డిజైన్ చేశారు. విశేషం ఏంటంటే... ఈ లెహంగాలో కనిపించే ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేతులతోనే చేశారట. ఎక్కడా మిషన్ ఉపయోగించకపోవడంతో దీని డిజైన్ కోసం కొన్ని వందల గంటలు పట్టిందట. మార్వాడి అమ్మాయి మిహీక నలుగు వేడుకలో ధరించిన డ్రెస్ కూడా ఎంతో ఖరీదైనదే! దాని ధర రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. దీన్ని డిజైన్ చేసింది అర్పితా మెహతా.
Miheeka Bajaj
Lehenga
Dress
Designer
Rana Daggubati
Wedding

More Telugu News