Rana Daggubati: ప్రేయసి మెళ్లో మూడు ముళ్లు వేసిన రానా

Rana ties the knot with Miheeka Bajaj amid stricter corona protocol
  • హైదరాబాదులో ఘనంగా రానా-మిహీకాల పెళ్లి
  • కరోనా నిబంధనల మధ్య జరిగిన సెలబ్రిటీ మ్యారేజి
  • కొద్దిమంది అతిథులు హాజరు
టాలీవుడ్ భల్లాలదేవుడు రానా ఓ ఇంటివాడయ్యాడు. రానా వివాహం తన ప్రేయసి మిహీకా బజాజ్ తో కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో రానా తన ప్రేయసి మిహీకా బజాజ్ మెళ్లో మూడు ముళ్లు వేశాడు.

 కాగా, కరోనా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ సెలబ్రిటీ మ్యారేజికి చాలా కొద్దిమంది అతిథులనే పిలిచారు. అల్లు అర్జున్, సమంత అక్కినేని తదితరులు పెళ్లికి వచ్చినట్టు తెలిసింది! దగ్గుబాటి ఫ్యామిలీ పక్కాగా కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ పెళ్లి నిర్వహించింది. పెళ్లికి రాని వారి కోసం వీఆర్ టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్ లో చూసిన అనుభూతి కల్పించారు.
Rana Daggubati
Miheeka Bajaj
Wedding
Ramanaidu Studios
Hyderabad
Corona Virus

More Telugu News