Mahesh Babu: నా పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానంపై అవగాహన కల్పించండి: మహేశ్ బాబు పిలుపు

Mahesh Babu calls fans to take up Plasma donation awareness programs on his birthday
  • రేపు మహేశ్ బాబు జన్మదినం
  • వీలైతే ప్లాస్మా దానం చేయాలన్న మహేశ్ బాబు
  • ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్న సజ్జనార్ కు అభినందనలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని వెలువరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహేశ్ బాబు కొనియాడారు. ప్లాస్మా దానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీస్ శాఖ చాలా సమర్థంగా పనిచేస్తోందని, అనుక్షణం ప్రజల భద్రత చూసుకుంటూనే, మరోవైపు ప్లాస్మా దానం గురించి ప్రజలకు వివరిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీపీ సజ్జనార్ ను అభినందించారు.

అంతేకాదు, తన పుట్టినరోజు నాడు చేయాల్సిన పనులను అభిమానులకు నిర్దేశించారు. రేపు తన అభిమానులంతా ప్లాస్మా దానంపై ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు. అవకాశం ఉన్నవాళ్లందరూ ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని మహేశ్ బాబు పేర్కొన్నారు.
Mahesh Babu
Plasma Donation
Birthday
Fans
Awareness Program

More Telugu News