Nagababu: సంగీత సాయి... ఈ లోకానికి దూరమై మా గుండెల్లో విషాదాన్ని నింపావు: నాగబాబు

Nagababu saddened for the demise of a Janasena leader Sangitha Sai
  • జనసేన నేత సంగీత సాయి హఠాన్మరణం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన నాగబాబు
  • మనసుకు ఎంతో చేరువైన వ్యక్తి అంటూ ట్వీట్
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత సంగీత సాయి గుణ రంజన్ ఆకస్మిక మరణం పట్ల నటుడు నాగబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ లోకానికి దూరమై గుండెల్లో విషాదాన్ని నింపావు అంటూ నాగబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "నా మనసుకు ఎంతో చేరువైన, నా కుటుంబంలో ఒకడిగా మెలిగిన వ్యక్తి సంగీత సాయి" అని నాగబాబు వివరించారు. "సాయి... నువ్వు భౌతికంగా దూరం అయినా, నువ్వు అన్నా అని పిలిచే పిలుపు నా చుట్టూ ఎప్పుడూ ఉంటుంది" అంటూ భావోద్వేగాలతో ట్వీట్ చేశారు.
Nagababu
Sangitha Babu
Death
Janasena
East Godavari District

More Telugu News