Singer Smitha: ఎలక్ట్రీషియన్ వల్ల నాకు కరోనా వచ్చింది: సింగర్ స్మిత

Singer Smitha said that she got Corona from an electrician
  • కొన్ని రోజుల క్రితం మా ఇంటికి ఎలక్ట్రీషియన్ వచ్చాడు
  • నాకు, నా భర్తకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది
  • కోలుకున్న తర్వాత ప్లాస్మా డొనేట్ చేస్తా
సింగర్ స్మితతో పాటు ఆమె భర్తకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీనిపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ పలు విషయాలను పంచుకున్నారు. మన దేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి తాము ఎంతో జాగ్రత్తగా ఉన్నామని... అయినప్పటికీ అది తమకు సోకిందని చెప్పారు.

ఒకరోజు ఒళ్లంతా విపరీతమైన నొప్పులు వచ్చాయని... వర్కౌట్లు ఎక్కువగా చేయడం వల్ల నొప్పులు వచ్చాయేమోనని అనుకున్నానని తెలిపారు. అయితే శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతున్నట్టు అనిపించడంతో... అనుమానం వచ్చి కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం తమ ఇంటికి ఎలక్ట్రీషియన్ వచ్చాడని... అతని ద్వారానే కరోనా తమకు సోకినట్టు ఆ తర్వాత తెలిసిందని అన్నారు.

తమ ఇంట్లో ఉన్న అందరూ టెస్టులు చేయించుకున్నామని... తనకు, తన భర్తకు పాజిటివ్ రాగా... తన కూతురు శివికి నెగెటివ్ వచ్చిందని స్మిత చెప్పారు. శివిని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో... తన తల్లి వచ్చి ఆమెను విజయవాడకు తీసుకెళ్లిందని తెలిపారు. పాపకు దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం చేయడానికి  సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Singer Smitha
Corona Virus
Tollywood

More Telugu News