Somu Veerraju: కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP new chief Somu Veerraju met Kanna Lakshminarayana
  • ఇటీవలే రాష్ట్ర బీజేపీ పగ్గాలందుకున్న సోము వీర్రాజు
  • గుంటూరులో కన్నా నివాసానికి వెళ్లినట్టు వెల్లడి
  • కొత్త చీఫ్ కు తన ఇంట్లో ఆతిథ్యమిచ్చిన కన్నా
ఇటీవలే ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని సోము వీర్రాజు ట్విట్టర్ లో వెల్లడించారు. గుంటూరులోని కన్నా నివాసానికి వెళ్లానని సోము తెలిపారు. కాగా, కొత్త బీజేపీ చీఫ్ ను కన్నా తన నివాసంలో సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు తన ఇంట్లోనే విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్టు తెలిసింది.
Somu Veerraju
Kanna Lakshminarayana
Guntur
New President
BJP
Andhra Pradesh

More Telugu News