sudheer reddy: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయ‌న భార్యాపిల్ల‌ల‌కు క‌రోనా నిర్ధార‌ణ‌

sudheer reddy tests corona possitive
  • సుధీర్ రెడ్డి భార్య‌కు 3 రోజుల క్రితమే క‌రోనా
  • నిన్న ప‌రీక్ష‌లు చేయించుకున్న ఇత‌ర కుటుంబ స‌భ్యులు
  • ఆయ‌న‌ ఇంట్లో వంట మ‌నిషికి కూడా క‌రోనా
  • హోమ్ ఐసోలేష‌న్‌లో ఎమ్మెల్యే కుటుంబం
తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయ‌న భార్య‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో మూడు రోజుల క్రితం ఆమె ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. దీంతో ఆమెకు క‌రోనా నిర్ధార‌ణ అయింది.

అనంతరం నిన్న సుధీర్ రెడ్డితో పాటు ఆయ‌న ఇద్దరు కొడుకులు, ఆయ‌న‌ ఇంట్లో ప‌ని చేసేవారు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. సుధీర్ రెడ్డితో పాటు  ఇద్ద‌రు కుమారులు, వంట మ‌నిషికి క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యే, ఆయ‌న కుటుంబ స‌భ్యులు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు వారు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.
sudheer reddy
TRS
Corona Virus
Telangana

More Telugu News