Andhra Pradesh: శానిటైజర్లు తాగుతున్న144 మందిని పట్టుకున్న ఎస్ఈబీ

SEB caught 144 sanitiser drinking people
  • మత్తు కోసం శానిటైజర్లు తాగుతున్న మందుబాబులు
  • ప్రాణాలు పోతాయని తెలిసినా పట్టించుకోని వైనం
  • కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన అధికారులు
లాక్ డౌన్ సమయంలో మద్యం దొరకకపోవడంతో... మత్తు కోసం పలువురు శానిటైజర్లకు అలవాటు పడ్డారు. శానిటైజర్లు తాగి ఇప్పటికే ఏపీలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ వాటికి అలవాటుపడిన వారు ఇంకా తాగుతూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎస్ఈబీ అధికారులు శానిటైజర్లు తాగుతున్న 144 మందిని పట్టుకున్నారు. వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈబీ అధికారులు మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. బెల్టు షాపులు, నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు జరుపుతున్నామని  తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు.
Andhra Pradesh
Sanitiser
Drink

More Telugu News