London: ఈ నెల 17 నుంచి భారత్- లండన్ మధ్య విమాన సర్వీసులు: బ్రిటిష్ ఎయిర్‌వేస్

British Airways ready to resume flight services between India And London
  • భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం
  • లండన్ నుంచి ఢిల్లీ, ముంబైకి వారంలో ఐదు విమానాలు
  • హైదరాబాద్, బెంగళూరు నగరాలకు నాలుగు విమాన సర్వీసులు
లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు బ్రిటిష్ ఎయిర్‌వేస్ సిద్ధమవుతోంది. ఈ నెల 17 నుంచి భారత్-లండన్ మధ్య సేవలు అందించనున్నట్టు పేర్కొంది. భారత్‌లోని ముఖ్య నగరాలైన ఢిల్లీ, ముంబై నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వారంలో ఐదు విమానాలు; అలాగే, హీత్రూ నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వారంలో నాలుగు విమానాలు నడపనున్నట్టు వివరించింది.

ఈ మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరినట్టు తెలిపింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే విమాన సర్వీసులు ఉంటాయని పేర్కొంది. కేబిన్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరిస్తారని, ప్రయాణికులతో తక్కువ సంబంధాలు ఉండేలా సరికొత్త ఆహార సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ వివరించింది.
London
Hyderabad
Bengaluru
New Delhi
Mumbai
British Airways

More Telugu News