Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Pooja Hegde tells she used to feel tense while her movie was being released
  • పూజ హెగ్డే అలవాటు చేసుకున్న ఫిలాసఫీ  
  • తనయుడి కోసం కథలు వింటున్న బాలకృష్ణ
  • రజనీకాంత్ షూటింగ్ ఆరు నెలల వాయిదా  
*  'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా సినిమా రిలీజ్ అవుతోందంటే చాలా ఒత్తిడికి గురయ్యేదానిని' అంటోంది కథానాయిక పూజ హెగ్డే. 'సినిమా రేపు రిలీజ్ అనగా టెన్షన్ ఎక్కువయ్యేది. నిద్రపట్టేది కాదు.. ఇక రిలీజ్ రోజైతే చెప్పేక్కర్లేదు. సినిమా ఫలితం గురించి ఎవరేం చెబుతారో అని టెన్షన్ పడేదాన్ని. అయితే, రాన్రాను అది తగ్గిపోయింది. ఏం జరిగినా మన మంచికే అనే ఫిలాసఫీ అలవాటు చేసుకున్నాను. దాంతో ఇప్పుడు మునుపటిలా టెన్షన్ పడడం లేదు' అని చెప్పింది పూజ.
*  నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం అతనికి సూట్ అయ్యే కథ కోసం బాలకృష్ణ చూస్తున్నారట. ఈ క్రమంలో పలువురు దర్శకులు చెప్పే కథలు వింటున్నారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
*  రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'అన్నాత్తే' చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి చెన్నైలో జరుగుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో రజనీకాంత్ సూచన మేరకు మరో ఆరు నెలల వరకు షూటింగును వాయిదావేసినట్టు తాజా సమాచారం.
Pooja Hegde
Balakrishna
Mokshajna
Rajaneekanth

More Telugu News