Chaitanya: సింగర్ సునీత మేనల్లుడ్ని అని చెప్పుకుంటున్న చైతన్యను అరెస్ట్ చేసిన పోలీసులు

Youth cheated as Singer Sunitha nephew was arrested
  • పోలీసుల అదుపులో చైతన్య అనే యువకుడు
  • ఇటీవల ఓ వీడియోలో చైతన్య గురించి చెప్పిన సింగర్ సునీత
  • అతడు తనకు మేనల్లుడు కాడని స్పష్టీకరణ
ఇటీవల టాలీవుడ్ సింగర్ సునీత ఓ వీడియోలో చైతన్య అనే యువకుడి గురించి వెల్లడించడం తెలిసిందే. తనకు బాగా కావాల్సిన వాడ్నని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించారు. తన మేనల్లుడిగా సెలబ్రటీలతో పరిచయాలు ఏర్పరచుకుంటున్నాడని తెలిపారు. అతడి వలలో ఎవరూ చిక్కుకోవద్దని సునీత విజ్ఞప్తి చేశారు. తనకు మేనల్లుడు అంటూ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇప్పుడా యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు చైతన్యపై కేసు నమోదు చేసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడ్ని విచారించి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. చైతన్య స్వస్థలం అనంతపురం జిల్లా రామగిరి అని తెలుస్తోంది.
Chaitanya
Arrest
Singer Sunitha
Cyber Crime

More Telugu News