T20 World Cup: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగేది భారత్ లోనే: ఐసీసీ స్పష్టీకరణ

ICC reveals latest schedule on mega events
  • ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 మెగాటోర్నీ వాయిదా
  • 2022లో ఆస్ట్రేలియా గడ్డపైనే టోర్నీ నిర్వహణ
  • మహిళల వరల్డ్ కప్ పోటీలు 2022కి రీషెడ్యూల్
కరోనా మహమ్మారి ప్రభావంతో క్రీడా పోటీల షెడ్యూళ్లు తారుమారవుతున్నాయి. ఐపీఎల్ వంటి భారీ క్రికెట్ సంరంభం సైతం దేశం వెలుపల జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, మెగా క్రికెట్ ఈవెంట్లపై ఐసీసీ స్పష్టతనిచ్చింది.

ముందు నిర్దేశించిన ప్రకారం 2021లో జరగాల్సిన పురుషుల టీ20 ప్రపంచకప్ భారత్ లోనే జరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ ఏడాది ఆసీస్ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 పురుషుల వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలోనే 2022లో జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి వివరించింది. ఇక, న్యూజిలాండ్ లో వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వరల్డ్ కప్ పోటీలను 2022కి రీషెడ్యూల్ చేశారు.
T20 World Cup
India
Australia
Womens World Cup
New Zealand
ICC
Corona Virus

More Telugu News