Chiranjeevi: కరోనా బారిన పడిన మా బంధువు ప్లాస్మా దానం వల్లే కోలుకున్నారు: చిరంజీవి

  • ప్లాస్మా దాతలకు సీపీ సజ్జనార్ సత్కారం
  • సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి
  • కరోనా బాధితులకు ప్లాస్మా ఓ సంజీవని అని పేర్కొన్న మెగాస్టార్
Chiranjeevi hails plasma donation in corona situations

కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, కరోనాకు మందులేని గందరగోళ పరిస్థితుల నడుమ ప్లాస్మా దానం సంజీవనిగా మారిందని అభివర్ణించారు.

 కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడంలో ప్లాస్మా చికిత్స 99 శాతం సఫలం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తమ బంధువు ఒకరు కరోనా సోకి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, స్వామినాయుడు అనే వ్యక్తి ప్లాస్మా దానం చేశారని చిరంజీవి వెల్లడించారు. ప్లాస్మా చికిత్స అనంతరం తమ బంధువు కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు. ప్లాస్మా దానం వల్ల రక్తం నష్టపోతామన్న అపోహ వద్దని, ఒక రోజు నుంచి రెండ్రోజుల్లోపల తిరిగి ఆ రక్తం భర్తీ అవుతుందని తెలిపారు.

More Telugu News