Rahul Gandhi: కరోనా విషయంలో నేను చెప్పినట్లే జరిగింది: జులై 17న చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

  • కరోనా 10 లక్షల మార్కును దాటిందని అప్పట్లో రాహుల్ ట్వీట్
  • ఆగస్టు 10లోపు దేశంలో 20 లక్షలు దాటుతుందని జోస్యం
  • తాను చెప్పింది ఇప్పుడు నిజమైందన్న రాహుల్
  • మోదీ సర్కారుపై విమర్శలు
 Indias COVID19 tally crosses 20 lakh mark says rahul

దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటిన సందర్భంగా జులై 17న తాను చేసిన ట్వీట్‌ను ఆయన ఈ రోజు రీట్వీట్  చేశారు.

'దేశంలో కరోనా 10 లక్షల మార్కును దాటింది. దేశంలో కరోనా విజృంభణ అధికంగా ఉంది. ఆగస్టు 10లోపు దేశంలో 20 లక్షల మందికి పైగా కరోనా సోకుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తప్పకుండా ప్రణాళికలు వేసుకుని, సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి' అని రాహుల్ గాంధీ అప్పట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ... 'దేశంలో ఇప్పుడు కరోనా కేసులు 20 లక్షల మార్కును దాటాయి. మోదీ ప్రభుత్వం కనపడడం లేదు' అని ఆయన విమర్శించారు.

More Telugu News