Chiranjeevi: పరుచూరి వెంకటేశ్వరరావును పరామర్శించిన చిరంజీవి

Chiranjeevi calls Paruchuri Venkateshwara Rao
  • గుండెపోటుతో మృతి చెందిన పరుచూరి వెంకటేశ్వరరావు భార్య
  • పరుచూరికి ఫోన్ చేసిన చిరంజీవి
  • విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న మెగాస్టార్
ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి ఈ తెల్లవారుజామున మరణించారు. గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పరుచూరికి చిరంజీవి ఫోన్ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, వ్యక్తిగతంగా పరుచూరి తనకు ఎంతో ఆప్తుడని, ఆయనతో తనకు చాలా అనుబంధం ఉందని చెప్పారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
Chiranjeevi
Paruchuri Venkateshwara Rao
Tollywood

More Telugu News