చిరంజీవి నివాసానికి వెళ్లిన ఏపీ బీజేపీ కొత్త చీఫ్

06-08-2020 Thu 18:48
AP BJP Chief Somu Veerraju met Chiranjeevi in Hyderabad
  • ఇటీవలే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమితుడైన సోము
  • సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
  • కొత్త బాధ్యతల్లో రాణించాలంటూ ఆకాంక్ష

ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.  హైదరాబాదులోని తన నివాసానికి వచ్చిన సోము వీర్రాజును చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకున్న సోము వీర్రాజును చిరంజీవి శాలువతో సత్కరించారు. సరికొత్త బాధ్యతల్లో రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర నిర్మాత ఎస్వీ బాబు కూడా సోము వీర్రాజుతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు.