వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై-కేటగిరీ భద్రతను కేటాయించిన కేంద్రం

Thu, Aug 06, 2020, 11:50 AM
YSRCP MP Raghu Ramakrishna Raju gets Y Category security
  • వైసీపీ ఎమ్మెల్యేలతో ముప్పు ఉందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన రఘురాజు
  • నిన్న రాత్రి సమాచారం అందిందన్న రఘురాజు
  • ఇప్పట్లో నియోజకవర్గానికి రాలేనన్న ఎంపీ
తనకు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ముప్పు ఉందని... కేంద్ర బలగాలతో తనకు భద్రతను కల్పించాలంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన విన్నపాలకు కేంద్రం స్పందించింది. ఆయనకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సందర్భంగా రఘురాజు మాట్లాడుతూ, తనకు వై-కేటగిరీ భద్రతను కల్పించినట్టు నిన్న రాత్రి తెలిసిందని చెప్పారు. ఈరోజు అధికారికంగా లేఖ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

వై-కేటగిరీ కింద తనకు దాదాపు 10 మంది సెక్యూరిటీగా ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో కరోనా కర్ఫ్యూ ఉందని... కర్ఫ్యూని సడలించిన తర్వాత వస్తానని తెలిపారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలపై తాను ఇచ్చిన ఫిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే  కేంద్రం భద్రతను కల్పించిందని చెప్పారు. తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement