KCR: ఉద్యమ సహచరుడు దూరం కావడంతో కేసీఆర్ దిగ్భ్రాంతి!

KCR Remembers Solipeta Ramalinga Reddy
  • ఈ ఉదయం కన్నుమూసిన రామలింగారెడ్డి
  • ఒకే ప్రాంతానికి చెందిన వారమని గుర్తు చేసుకున్న కేసీఆర్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఈ తెల్లవారుజామున దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం చెందడంతో, ఆ వార్త విని కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తనతో పాటు ఉద్యమంలో ఆయన పాల్గొన్నారని, తామిద్దరమూ ఒకే ప్రాంతానికి చెందిన వారమని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ద్వారా ఓ ప్రకటన జారీ అయింది.

"ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడిగా, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు" అని సీఎంఓ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
KCR
Solipeta Ramalinga Reddy

More Telugu News