Krishna River: ఎగువన భారీ వర్షాలు... కృష్ణా నదిపై రిజర్వాయర్లను ఖాళీ చేయాలని ఆదేశాలు!

  • నదిలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం
  • రెండు మూడు రోజుల్లో శ్రీశైలానికి నీరు
  • ఆల్మట్టి, నారాయణపూర్ లో ఖాళీ పెంచాలన్న కేంద్ర జల సంఘం
Heavy Rains in Karnataka and Maharashtra

కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, నదిలోకి భారీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఈ కారణంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో కొంత నీటిని దిగువకు వదిలేసి, ఖాళీ ఉంచుకోవాలని సూచించింది. తూర్పు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, దీంతో పలు పిల్ల కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆ నీరంతా నదిలోకి వస్తోందని వెల్లడించింది. నేడు, రేపు భారీ నీరు రానుందని జలసంఘం అధికారులు అంచనా వేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయం 75 శాతం వరకూ నిండిపోయేంత వరద రావచ్చని తెలియజేశారు.

More Telugu News